అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Palleturilone Sadhyam Lyrics in Telugu – Weekend Party – 2022
నేల తల్లికి తొలిసూరు బిడ్డ, పల్లెటూరు
ఇళ్ళన్ని చుక్కలుగా వేసిన… పెద్ద ముగ్గే పల్లెటూరు
మట్టిని ముద్దాడే పాదాలు
మట్టిని ముద్దాడే పాదాలు
ప్రవహించే చోటే పల్లెటూరు
లేలే లేలే లెమ్మంటూ
సూర్యుణ్ణి నిద్దర లేపటం
లేచి కూత పెట్టమంటూ
కోడిపుంజుని తొందర పెట్టడం
పేడ నీళ్లతో… అలుకు చల్లడం
నల్లబొగ్గుతో పళ్ళు తోమడం
గిలకబావిలో… నీళ్లు తోడటం
మట్టి కుండలో… వంట వండటం
ప్రకృతి మాత ఒడిలో, ఓ ఓఓ ఓ
ప్రకృతి మాత ఒడిలో
నిత్యం పసిపాపలుగా బ్రతకడం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం ||2||
పంచాయితీలో ఒక్కడి మాటకి
అందరు కట్టుబడి ఉండటం
పక్కింటి కూరలు… ఈ ఇంటి అన్నంతో
అనుబంధాన్నే కలపటం..
ఎవరో తెలియని… అతిధుల కోసం
ఇంటికి అరుగులు కట్టడం
చీమలు తినడం కోసం… బియ్యపిండితో
ముగ్గులు వెయ్యడం
తురక దూదేకుల పీరిలను ఎల్లయ్యే
ఎత్తుకొని తిరగటం
శ్రీరామ నవమి వడపప్పుని చాంద్ పాషా
అందరికి పంచటం
ప్రకృతి మాత గుడిలో, ఓఓ ఓఓ
ప్రకృతి మాత గుడిలో
నిత్యం భక్తులుగా బ్రతికెయ్యటం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
గోచీకట్టిన కాసేపోసిన
అశ్లీలత ఆనింపించదు
పనిపాటల్లో తిట్లు దొర్లిన
అసభ్యంగా వినిపించదు
చెంబు చేట బయటే ఉన్నా
దొంగలు రారని నమ్మకం
విత్తులు నాగలి సిద్ధం చేసి
వానోస్తుందని విశ్వాసం
పురుగు పుట్రతో కలిసుంటూ
చావొస్తే రానివ్వను ధైర్యం ||2||
ప్రకృతి మాత బడిలో, ఓ ఓఓ ఓ
విద్యార్థులు గా బ్రతకటం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం
పల్లెటూరిలోనే సాధ్యం
ఇది పల్లెటూరిలోనే సాధ్యం ||2||.. ..
Palleturilone Sadhyam Lyrics in Telugu – Weekend Party – 2022