Menu Close

Pallavinchu Tholi Raagame Song Lyrics In Telugu – Raja

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Pallavinchu Tholi Raagame Song Lyrics In Telugu – Raja

లలలలలల……….
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈ పాట… విధి దారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత… నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు… అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

లలలలలల……. లాలలా లాలలా లాలలా
పలికే గుండె వేణువులో… స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే… పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో… శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను… ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటికిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయo

బ్రతుకే పాటగా మారి… బాటయే మార్చగా
వెతికే వెలుగు లోకాలే… ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా… నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో… సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈ పాట… విధి దారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత… నా పాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు… అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం
లలలలలల……. లాలలా లాలలా లాలలా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading