ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Paduchu Bangarama Lyrics in Telugu – Andarivaadu
ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమ చిలకవే మధురిమ
మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం
నిను చూసే తరునంలో తనువంత బృందావనం…
నీ చెంత నే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని
నిను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని
అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో
ఎండలేంటి హొయిలాలో
అరే నీలొ నాలొ లోలొ
వేడి పుట్టింది లేత ఈడులో హోయ్
నా కలలో తొలిగా మలిగా చలిగా
గిలిగా కలిగే వలపే నీ కంటి కాటుతో
నా ఎదలో సొదగా రొదగా అదిగా
ఇదిగా ఎదిగె తలపే నీ పైట వేటుతో
చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక
ఇంత మోజు దక్కలేదు ఏంటంటా
నన్ని నువ్వు రాజుకుంటే లోన నిప్పు పుంజుకుంటె
మోజు రాక ఊరుకుంటదా..
ఒలికేటి వయ్యార మంత
మొయ్యాల నేటి సయ్యాటకి
పదకొంటె కయ్యాల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికే
అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో
ఎండలేంటి హొయిలాలో
అరే నీలొ నాలొ లోలొ
వేడి పుట్టింది లేత ఈడులో హోయ్
ఓ పడుచు బంగారమా పలకవే సరిగమ
చిలిపి శృంగారమ చిలకవే మధురిమ
ఈ కథలో పగలే వగలె పొగల సెగల
రగిలే సరిగా సరసాల వేళలో
నీ జతలో లతగా సతిగా రతిగా అతిగా
వతినే మరిచా మునిపంటి గోళ్లలో
కల్ల బొల్లి మాట దాటి అల్లి బిల్లి ఆట తోటి
అల్లుకున్న ఆశ తీర దేంటంటా
బెల్లమంటి బుల్లి గుండె కల్ల ముందు
జల్లు మంటె ఆశ కంటు అంతు ఉంటదా
కొల్లేటి కోటల్లొ కోటి ఘాటుల్లో వాటమే ఉందిలే
ఈ మంచు మీటుల్లో మబ్బు చాటుల్లో
మౌమాటమే వద్దులే
అరే ఏలొ ఏలొ ఏలొ ఈ వెన్నెలో
ఎండలేంటి హొయిలాలో
అరే నీలొ నాలొ లోలొ
డి పుట్టింది లేత ఈడులో హోయ్
ఓ పడుచు బంగారమాపలకవే సరిగమ
చిలిపి శృంగారమ చిలకవే మధురిమ