ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Paathashalalo Friendship Lyrics in Telugu – Ori Devuda
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగ
ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా
దారంతా ఆ బంధం మెరిసినదందంగా
అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా
కలిసి మెలిసీ కదిలే పయనంగా
కళలా కలలా సాగుతోంది సాగా
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగ
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగ
తారలను తడిమేలాగా
పాదములు ఎగిరే వేళా
నీ జతై నీ జతై చేసినా ఊలాల
గంటలొక నిమిషములాగ
రోజులను గడిపే వేళ
నీ ప్రతీ ఊహలో ఊగినా ఉయ్యాల
తెల్లారులు ఆ కబురుల్లో
తుళ్ళేట్టు చేసే ప్రైవేట్ పార్టీస్
ఉల్లాసమెంతో మనసుల్లో
నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్
ఎన్నాళ్ళకైనా గురుతుల్లో
ఎన్నేళ్లకైనా జ్ఞాపకాల్లో
ఉంటాయిగా ఈ హృదయాల్లో
నా సంతోష దీపాలుగా
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగ
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగ
ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా
దారంతా ఆ బంధం మెరిసినదందంగా
అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ
కలిసి మెలిసి కదిలే పయనంగా
కళలా కలలా సాగుతుంది సాగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా..!!
పాఠశాలలో, పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా..!