Menu Close

Oohalu Oorege Gaalanthaa Song Lyrics In Telugu – Sammohanam

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి… తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట..!
చాలా పద్దతిగా… భావం తెలిసి
ఏదో అనడం కంటే…
సాగే కబుర్లతో… కాలం మరిచి
సరదా పడదామంతే…!!

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

పరవశమా మరీ ఇలా… పరిచయమంత లేదుగా
పొరబడిపోకు అంతలా… నను అడిగావా ముందుగా
నేనేదో భ్రమలో ఉన్నానేమో… నీ చిరునవ్వేదో చెబుతోందని
అది నిజమే అయినా… నాతో అనకూ నమ్మలేనంతగా

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

తగదు సుమా… అంటూ ఉంటే
తలపు దుమారం ఆగదే
తొలి దశలో… అంతా ఇంతే
కలవరపాటు తేలదే
ఈ బిడియం… గడియే తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు
ఇదిగో ఇదదే… అనుకోమనకు
ఆశలే రేపగా…ఆ ఆఆ ఆ

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా
ఈ సమయానికి… తగు మాటలేమిటో
ఎవ్వరినడగాలట..!!

Like and Share
+1
1
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading