Menu Close

Oka Devatha Dosedu Lyrics in Telugu – Sega


Oka Devatha Dosedu Lyrics in Telugu – Sega

ఓ ఒక దేవత దోసెడు వరములతో
తరిమితే ఎంత సుఖం
నువ్వు కసురుగా విసిరినా చూపులకే
కలిగెను అంత సుఖం

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

నీ కన్నుల్లోని కాటుకల
నా గుండెల్లోకి నాటుకున్నావ్
నీ మాటల్తోటి తాటకల
ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే
నీ కుడి వైపైనా చోటు ఉందా
అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే
ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ

ఒక దేవత దోసెడు వరములతో
తరిమితే ఎంత సుఖం
నువ్వు కసురుగా విసిరినా చూపులకే
కలిగెను అంత సుఖం

నా లోకం నిండుగా నీ మైకం నిండెనే
నా కైనా చెప్పక సంతోషం చల్లేనే

నా చిన్ని చిన్ని సరదాలు అన్ని అల్లే గిల్లె నన్నే నీల
నా పైన ఉన్న పరదాలు అన్ని జల్లై పోయే నీ వల్లేగా

చీకట్లో ఉంటె రేయిల
మిరిమిట్లు గొలిపే మెరుపు నువ్వై
పిల్ల నన్నే అల్లుకో దీపం పువ్వువై

తప్పదులే ఇంకా ఉండిపో
నా హృదయం నిండా నిండిపో
నా కంటూ లేదు ఏ సొంత నీడ
అని చెప్పుకు తిరిగే వాడిని
నా పై జాలిని పోగొట్టావ్ ఓఓఓ

విరబూసిన పూవిది అందరిదీ
పరిమళం నా సొంతం
గుడిలో నది స్నానము అందరికి
పరవశం నా సొంతం ఓఓఓ

నీ అడుగుల్లో జత పడుతూ నా జీవితం ముడిపడెనే
ఈ దూరం చూపుల్తో నిన్నే ముద్దాడేస్తుందే
ఈ సున్నా నీతో శూన్యమై కనలేని విలువే పొందిన
నా కంటి పాపలో లోపముంటే అది నువ్వే నువ్వే
ఈ లోకం కనపడదే ఓఓఓ

ఓ ఒక దేవత దోసెడు వరములతో
తరిమితే ఎంత సుఖం
నువ్వు కసురుగా విసిరినా చూపులకే
కలిగెను అంత సుఖం

నీ కన్నుల్లోని కాటుకల
నా గుండెల్లోకి నాటుకున్నావ్
నీ మాటల్తోటి తాటకల
ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే
నీ కుడి వైపైనా చోటు ఉందా
అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే
ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ

ఒక దేవత దోసెడు వరములతో
తరిమితే ఎంత సుఖం
నువ్వు కసురుగా విసిరినా చూపులకే
కలిగెను అంత సుఖం
ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ

Oka Devatha Dosedu Lyrics in Telugu – Sega

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading