అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Oho Laila Lyrics in Telugu – Chaitanya
ఓహో లైలా… ఓ చారుశీల కోపమేల
మనకేలా గోల మందారమాలా
మాపటేళ
ఓహో… పిల్లా సుభానల్లా
సరాగంలో విరాగాలా
మిసమిస వయసు
రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలక
కసికసి పెదవుల కదలికల కవితల
పిలుపులు తెలిసె కవినిగనక॥లైలా॥
చరణం : 1
విశాఖలో నువ్వూ నేనూ వసంతమే ఆడాలా
హుషారుగా చిన్నా పెద్దా షికారులే చెయ్యాల
వివాహపు పొత్తుల్లోనే వివాదమా ఓ బాలా
వరించిన వలపుల్లోనే విరించిలా రాయాలా
అందచందాల అతివల్లోన కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోన తప్పనీ తాళమా
చాల్లే బాల… నీ… ఛా ఛా… ఛీల
సంధ్యారాగాలాపనా॥లైలా॥
చరణం : 2
జపించిన మంత్రం నీవే
తపించిన స్నేహంలో
ప్రపంచము స్వర్గం నీవే
స్మరించిన ప్రేమల్లో
చెలీ… సఖీ… అంటూ నీకై
జ్వలించిన ప్రాణంలో
ఇదీ కథ అన్నీ తెలిసీ క్షమించవే ప్రాయంతో
కాళ్లబేరాలకొచ్చాకైనా కాకలే తీరవా
గేరు మార్చేసి పాహి అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించు గోల ప్రేమిస్తున్నా ఘాటుగా॥లైలా॥