Menu Close

O Priya Priya Telugu Song Lyrics in Telugu – Geethanjali

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు… రాలు పూల దండలు…
నీదో లోకం నాదో లోకం… నింగి నేల తాకేదెలాగ…

ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా…
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా…
ఏల జాలి మాటలు… మాసిపోవు ఆశలు…
నింగీనేల తాకేవేళ… నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే… రేపు లేదులే…
వీడుకోలిదే… వీడుకోలిదే…

నిప్పులోన కాలదు… నీటిలోన నానదు…
గాలిలాగ మారదు… ప్రేమ సత్యము…

రాచవీటి కన్నెదీ… రంగు రంగు స్వప్నము…
పేదవాడి కంటిలో… ప్రేమ రక్తము…

గగనాలు భువనాలు…. వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు… పిలిచేది ప్రేమతో…
ఎన్ని బాదలొచ్చినా… ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి… లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ…నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి… కృష్ణ రాసలీలకి…
ప్రణయమూర్తి రాధకీ… ప్రేమ పల్లవి…

ఆ అణారు ఆశకి… తాజ్మహలు శోభకి…
పేదవాడి ప్రేమకి… చావు పల్లకి…

నిధికన్నా ఎదమిన్న… గెలిపించు ప్రేమలే…
కథకాదు బ్రతుకంటే… బలికాని ప్రేమని…
వెళ్ళిపోకు నేస్తమా… ప్రాణమైన బంధమా…
పెంచుకున్న పాశమే… తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ…నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా…
ఓ ప్రియా ప్రియా… నా ప్రియా ప్రియా…
కాలమన్న ప్రేయసి… తీర్చమందిలేకసి…

నింగీ నేల తాకేవేళ… నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం… లేదు బందనం…
ప్రేమకే జయం… ప్రేమదే జయం…

Like and Share
+1
0
+1
6
+1
0

Subscribe for latest updates

Loading