ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
O Jabili Vennela Akasam Lyrics In Telugu – Rangoon Rowdy
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది
కలువ నీ కోసమే… ఏ
వెలుగువై రావోయి వెలుతురే తేవోయి
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం
నువ్వు లేక నవ్వ లేక… ఎందరున్నా ఎవరులేకా
జంటగాని తోడులేక ఒంటిగా నే నుండలేను
స్నేహ దీపాలు, స్నేహ దీపాలు వెలగనీ చాలు
చీకటే లేదోయి,
వెలుగువై రావోయి… వెలుతురే తేవోయి
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం
గువ్వలాగా నువ్వు రాగ… గూడు నవ్వే, గుండె నవ్వే
వేకువల్లే నీవు రాగ… చీకటంతా చెదిరిపోయే
తుడిచి కన్నీళ్ళు, ఊఊ ఉ
తుడిచి కన్నీళ్ళు కలిసి నూరేళ్ళు జతగా ఉందామోయి
వెలుగువే నీవోయి… వెలుతురే కావోయి
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
కదలిపోయే కాలమంతా… నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్నా కౌగిలింత… వలపు తీపి వలలు వేసే
భ్రమర నాధాలు… ఊఊ
భ్రమర నాధాలు ప్రేమగీతాలై… పరిమళించేనోయి, ఈ
పున్నమై రావోయి… నా పుణ్నెమే నీవోయి
ఓ జాబిలీ.. ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం
నవ్వులన్నీ పువ్వులైన… నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి ఎదను మీటే… ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు… ఊ ఊ
ఇన్ని రాగాలు నీకు అందించే
రాగమే నేనోయి అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలీ… ఈ ఈ వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం… జుంజుంజుం జుంజుంజుం