Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
O Cheliya Naa Priya Sakhiya Lyrics In Telugu – Premikudu
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని
నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో
మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఈ పూట చెలి నా మాట
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమున
ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో
అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు
మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా
ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ
నీ చేతిలో ఊన్నదిలే, ఏ ఏ ఏ
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
కోకిలమ్మ నువ్వు సై అంటే
నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని
సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి
కాలి మేటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు
తెర చాపై నిలిచేనే
నా ఆశలా ఊసులే
చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే
ప్రేమ చరితలు అంటానే, ఏ ఏ ఏ
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని
నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో
మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా
చెయి జారెను నా మనసే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.