Menu Close

O Bangaru Rangula Chilaka Lyrics in Telugu – Thota Ramudu


O Bangaru Rangula Chilaka Lyrics in Telugu – Thota Ramudu

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ… ఈ ఈఈ
నా మీద ప్రేమే ఉందనీ… నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా… ఆ ఆఆ
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ… ఈ ఈఈ
నా మీద ప్రేమే ఉందనీ… నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ… బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో… ఓఓ ఓఓ
మేడలోని చిలకమ్మా… మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ… ఈ ఈఈ
నా మీద ప్రేమే ఉందనీ… నా పైన అలకే లేదనీ

సన్నజాజి తీగుంది… తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది… జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా.. ఆఆ ఆ
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ… నా పైన అలకే లేదనీ

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading