Menu Close

Nuvvostanante Nenoddantana Song Lyrics in Telugu – Varsham – ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన లిరిక్స్

Nuvvostanante Nenoddantana Song Lyrics in Telugu – Varsham – ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన లిరిక్స్ – Innallaku Gurtocchaana Vaana Lyrics

చినుకు రవ్వలో… చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో… చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె… వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న… వాన గువ్వలో
చినుకు రవ్వలో… చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన… చిలిపి నవ్వులో

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త
ఇన్నాళ్ళకు… గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని… దాక్కుంటావే పైన

ముద్దులొలికే ముక్కుపుడకై… ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా… చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా… కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా…
వగలకు నిగనిగ నగలను తొడిగేలా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
హా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
ఆహా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఆఆ తరికిట తరికిట త
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా

చిన్ననాటి తాయిలంలా… నిన్ను నాలో దాచుకోనా
కన్నెఏటి సోయగంలా… నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే… కిలకిల లోనా
పదములు ఆడే… కథకళి లోనా
కనులను తడిపే… కలతల లోనా
నా అణువణువున… నువు కనిపించేలా

నువ్వొస్తానంటే హా… నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే హే… నేనొద్దంటానా…
ఆఆ తరికిట తరికిట త…

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన… ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే… చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే… నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా…
నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ..

Nuvvostanante Nenoddantana Song Lyrics in Telugu – Varsham – ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన లిరిక్స్ – Innallaku Gurtocchaana Vaana Lyrics

Like and Share
+1
0
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading