Menu Close

NTR Aravinda Sametha Veera Raghava Telugu Movie Dialogues

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

1.బసిరెడ్డి బలం బస్తాల్లో వుండేది, మన బలం బస్తీల్లో ఉండేది!

2. ఈడ మంది లేరా..? కత్తులు లేవా..?

3. నిన్ను వేలు పట్టుకుని నడిపించాడు. నువ్వు ఇప్పుడు కాటికి నడిపియాల..!

4. ముప్పై ఏండ్లనాడు మీ తాతా కత్తి పట్టినాడు అంటే అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినడ౦టే అది వారసత్వం, పది దినాల్నాడు అదే కత్తి నవ్వు దూసినవంటే అది లక్షణం, ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమౌతుందా..?

5. ఆ పొద్దు నువ్వు కత్తి పట్టినట్టు లేదే, అది నీ చేతికి మొలిచినట్టుండేది…!!

6. అందరు యుద్ధంలో గెలవడమే చూస్తారు, అంత ఐపొనక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదూ.
గెలిచినోడు ఏడ్చాల, ఓడినోడు ఏడ్చాల, వాని రోజొస్తే ఎవుడైన గెలుస్తాడు…!

7. యుద్ధం రాకుండా ఆపుతాడే, వాడు గొప్ప..! వాడే గొప్పా..!!

8. కాదూ కూడదని మొండికేస్తే, బసిరెడ్డి గొంతులో దింపినా కత్తిని ఇంకా కడగలేదు…!

9. అస్సలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు…!
తగ్గితే తప్పెంటమ్మ…!

10.భీముడు, అర్జునుడు ఒంటి చేత్తో వందమందిని చంపగలరు. వాళ్ళ ఐదుగురికి కలిపి ఒక్క దురౌపది.
కృష్ణుడు కత్తి పట్టుకున్న ఒక్క ఫోటో అయినా చూసావా..? కానీ ఆయనకి ఎనిమిది మంది! అర్ధమైంద మాకు ఎవరూ నచ్చుతారో…?

11. నాకు ఏదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్ధం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది.

12. కొంచెం జరగరా.? నాకు స్పేస్ కావాలి. కొంచెం.
ఇటేపు మొత్తం వాడుకోండి..!

13. అన్నిటికి లాజిక్లు వుండవు నీలాంబరిగారు, అందుకే మన పేదోళ్లు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు..!

14. టఫ్ గ కనిపిస్తారుగాని మాట వింటారు..!

15. వినే టైం, చెప్పే మనిషివల్ల, విషయం విలువే మారిపోతుంది.

16. అరవింద గారు, మీరు విడి విడి గ చూడకండి కామం కనిపిస్తుంది..! అదే కలిపి చూసారనుకోండి, కామన్ గ ఉంటుంది..!

17. ప్రేమకైనా, పగకైనా ఒక మొహం కావాలి. అందుకే నా మొహం తప్పించిన..!

18. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్ట పడక్కర్లేదు.

19. ఆ పొద్దు వాడ్ని చూస్తావుంటే, చావు చొక్కా లేకుండా తిరగాడినట్టు వుంది…!

20. అర్ధంకాలేదు కదా..? అడుగు, అలా క్యూట్ గ చూడకు..!

21. కంట పడ్డావా కనికరిస్తానేమొ , ఎంట పడ్డన నరికేస్తా…!!

22. ఒకడ్ని కావాలనుకునే ముందు అమ్మాయిలు చాలా ఆలోచిస్తారు.
వీడు కాదు, వీడు కాదు అని పదిమందిని రిజెక్ట్ చేసి ఒకడి దగ్గర ఆగుతారు. వాడ్ని కౌగిలించు కొని, కళ్ళు మూసుకోగానే, మొత్తం ప్రపంచాన్ని షట్డౌన్ చేసేస్తారు. కానీ మీరు అలా కాదు. చూసిన మొదటి అమ్మాయి దగ్గరే ఆగిపోతారు. ప్రేమించకపోతే చచ్చిపోతారు. చేతులు కోసుకుంటారు. కాళ్లు పట్టుకుంటారు. అది ఒప్పుకునే దాక 24*7 టార్చెర్ పెట్టేస్తారు. సరే అనగానే కౌగలించుకుని ఆ
అమ్మాయి బుజం మీద నుంచి మిగతా ప్రపంచం చూడ్డం స్టార్ట్ చేస్తారు. నిన్న నా కళ్లలో ఓకే కనిపించింది. ఈరోజు పక్కన పెట్టేశావ్…!!

23. ఒక్కల్ని ఇస్తా పాడటానికి ఒక్క రైట్ ఇన్సిడెంట్ చాలు, Like yesterday..!
వదిలేయడానికి కూడా ఒక్కటే, Like today..!!

24. మండు వెసంకి గొంతులో దిగితే ఎట్లుంటదో తెల్సా,
మచ్చల పులి మొఖం మీద గాండ్రిస్తే ఎట్లుంటదో తెల్సా,
మట్టి తూఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటదో తెల్సా,
వాడు కత్తి ఇక్కడ దింపినప్పుడు నాకు అత్తా ఉండేది…!!

25. ఊళ్లల్లో టీ ససార్లో పోసుకుని తాగుతారు, కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు.
మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం, కానీ ససర్తో పటు ఇస్తారు..!!
మీ ఏరియా లో శాంతి పరిస్థితి కూడా అంతే, అవసరమైన వాళ్లకు దొరకదు,
దొరికినోళ్లు వాడుకోరు…!!

26. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చెరిచేది వినుంటారు,
కాని ఇప్పుడు మీకు ఒక మగాడు మగాడ్ని చెరిస్తే ఎట్లుంటదో చూపిస్తాను…!!

27. చావుకి గనక గొంతుంటే ఇట్నే వుంటాదా…!!

28. వందడుగుల్లో నీరు పడుతుందంటే, తొంభై తొమ్మిది అడుగుల తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు..? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు వందడుగులతో సమానం..!

29. అమ్మాయిలు అబ్బాయిల్ని కౌగలించు కున్న తరవాత, అబ్బాయిలు అమ్మాయిల భుజం పై నుంచి ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతారు అన్నావ్. అది తప్పు. ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుదాం అనే బయలు దేరుతాడు, నాలాగా. అతనికి దారిలో నీ లాంటి అమ్మాయే కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళి దొరకదు అనే భయం తో ముందు ఇది, తర్వాతే మిగతావి అనుకుంటాడు. కాని మీరేమో నన్ను గెలిచినా తరవాత ప్రపంచం అంటాడేంటి అనుకుంటారు…!!

30. మీ మగాళ్లకి ఆడోల్లని సంతోష పెట్టాలంటే, డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువలరీ ఇస్తే చాలు, కంఫోర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవేం వద్దు, టైం ఇవ్వండి చాలు…!!

31. ఒక ఆడదాన్ని కష్టంలొంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు, అదే ఆడదాన్ని కస్టంలోకి నెట్టి కాపాడితే, అసహ్యం వేస్తుంది…!

32. యుద్ధం చేసే సత్తా లేనోడికి, శాంతి అడిగే హక్కు లేదు..!!

33. పులివెందుల ఫులంగాళ్ళ కాడనుంచి,
కడప కోటిరెడ్డి సర్కిల్ దాక,
కర్నూల్ కొండారెడ్డి బరిసె కాడనుంచి,
అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాక ,
బళ్లారి గనుల్లో దాక్కున్నా,
బేలాంగం పొలాల్లో పండుకున్న వదలా.
తరుముకుంట వస్త. తలకాయ కోస్తా..!!

34. ప్రతి ముప్ఫై సంవత్సరాలకు బతుకు తాలుక ఆలోచన మారుతుంది. సినిమావాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు దాన్ని ఫాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్ లో ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకు వెళ్ళేవాడు ఒక్కడే వస్తాడు..! వాడిని టార్చ్ బేరర్ అంటారు…!! వాడే ఆ టార్చ్ బేరర్..!!

35. మా నాయన పోయెందక నేను నరుకుతా అని నాకు తెలియదు, నరుకుకుండ్ల ..!
నీ గొంతులో పొడిసిందాకా నాకు అంత ఉగ్రం ఉండదని తెలియదు, పొడిసుండ్ల..!
మా జేజి అడిగిందాకా చేత కత్తి వదులుతని నాకు తెలియదు, వధులుండ్ల..!
మీ దాపున వుందే అమ్మి కొట్లాడకుండా రణం అపచు అని, అది సెప్పెవరకు నాకు తెలియదు, ఇన్ని దినాలు ఆపుండ్ల..!
నువ్వు అంటున్నవె మార్పు, అది ఎట్లా తేవాలో నాకు తెలియదు బసిరెడ్డి..!
కానీ తెస్తా..! ఇది ఖాయం..!!

36. మనకేం తెలుసు సర్, వీళ్లతో పోలిస్తే..!!
మా జేజి, పెనిమిటి పోయినా, చెట్టంత కొడుకు పోయినా, ఇన్ని సవులిచ్చావు కొన్ని కన్నీళ్లు ఇచ్చావు అని ఆ దేవుడ్ని తిట్టిందే గాని, బసిరెడ్డి కి సవెందుకు ఇవ్వలేదు అని వరం అడగలేదు సర్.
మా అమ్మ, నాన్న పోయాడని వంటింట్లో కూర్చుని ఏడిచిందేగాని, పగోడి పెళ్ళాం పసుపు కుంకలతో వుందని ఎప్పుడు ఏడవలేదు.
మా అత్త, ఇంట్లో ఎవరికీ బొట్టు లేదని తిట్టిందేగాని, ఆ ఇంట్లో బొట్లు తుడిసేయమని ఎప్పుడూ అడగలేదు.
ఇప్పుడు ఈ తల్లి కూడా, కన్న బిడ్డ పోయి నా, నా మొగుడి చంపాడని ఇక్కడికి వచ్చి గొడవ ఆపిందెగాని, ఈ ఊరోళ్లు ఏమైపోతే నాకేంటని గమ్మునుండలేదు,
వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సర్, తొడగొట్టడాలు, మీసం తిప్పడాలు తప్పా.

37. పాలిచ్చి పెంచిన తల్లులు సర్, పాలించడం ఒక లెక్క వీళ్ళకి.

38. బతకడం తెలిసినోడికి, నరకడం నచ్చదు..!!

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading