ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nirantharam Neethone Jeevinchalani Lyrics In Telugu – Telugu Christian Songs

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ… నన్నిల బ్రతికించుచున్నది ||2||
నా ప్రాణేశ్వరా యేసయ్యా… నా సర్వస్వమా యేసయ్యా

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ… నన్నిల బ్రతికించుచున్నది
చీకటిలో నేనున్నప్పుడు… నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని… నీ మహిమ నాలో నిలవాలని ||2||
పరిశుద్ధాత్మ అభిషేకముతో… నన్ను నింపుచున్నావు, నీరాకడకై
నిరంతరం నీతోనే జీవించాలనే… ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నీ రూపము నేను కోల్పోయినా… నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని… నీ వలనే నేను మారాలని ||2||
పరిశుద్ధాత్మ వరములతో… అలంకరించుచున్నావు, నీరాకడకై
నిరంతరం నీతోనే జీవించాలనే… ఆశ నన్నిల బ్రతికించుచున్నది
తొలకరి వర్షపు జల్లులలో… నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని… నీలోనే పుష్పించాలని ||2||
పరిశుద్ధాత్మ వర్షముతో… సిద్ద పరచుచున్నావు, నీరాకడకై
నిరంతరం నీతోనే జీవించాలనే… ఆశ నన్నిల బ్రతికించుచున్నది ||2||