ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nippu Thunakai Lyrics in Telugu – Andhrawala Songs Lyrics in Telugu
Nippu Thunakai Lyrics in Telugu – Andhrawala Songs Lyrics in Telugu
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే…నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నీ గుండెలో ఉంది ఉరిమే గుణం
నీ చేతిలో ఉంది పంచే గుణం
నీ వెంట సైన్యంలా కదిలే జనం
నీకోసమిస్తుంది నీరాజనం
నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా
ఎన్నడూ తల వంచక అలుసంది చెయ్యరా
ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా
మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా
హే…మాగుండెలో నువ్వు కొలువుండగా
ప్రతిరోజు మాకింక ఒక పండుగ
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నేరాలు గోరాలు వెంటాడగా
మేమంత చేరాము నీ చెంతగా
కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా
చేయూత నిచ్చావు నీ వంతుగా
చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా
ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా
శోకమే తొలగించగా దేశమే పులకించగా
కోపమే గర్వించగా యువరాజులాగ రారా
హే… తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే…నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా