Menu Close

Ninne Ninne Kora Song Lyrics In Telugu


నిన్నే నిన్నే కోరా… నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా… నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా… నీతో ప్రేమలోనా
ఇలా ఉండిపోనా… ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావే ఓ… నచ్చావే నచ్చావులే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

అనుకుని అనుకోగానే… సరాసరి ఎదురౌతావు
వేరే పనే లేదా నీకు… నన్నే వదలవూ
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను… గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది… సీతాకోక లాగా
నిన్నే నిన్నే కోరా… నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

నీతో ఏదో చెప్పాలంటూ… పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నదీ… ఓ ఓ
మనసునేను దాచమన్న అస్సలేమీ దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు… చూడకుంటే ఊసు పోదు
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా

నిన్నే నిన్నే కోరా… నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ||2||
ప్రతి జన్మలోనా… నీతో ప్రేమలోనా
ఇలా ఉండిపోనా… ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావులే ఓ… నచ్చావే నచ్చావులే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading