Menu Close

Nijam Idhe Kada Lyrics In Telugu – Raja Raja Chora

సందేళ గూడు లేని పావురానికి
నీడ దొరికెను ఇవ్వాలే
అందనున్న ఎద లోన సొంత రెక్కలే
సాయమివ్వనన్న సవాలే
నున్నగున్న దూరలే… మందలించే తీరాలే
నిజం ఇదే కదా… కలే విడి పదా

ఓ ఓ, నఖలు రాతలా… (నఖలు రాతలా)
నలిగిపోదువా..! మిగిలిపోకుమా…!
అసలు మాటవై… అసలు వేణువై
మరల రాయుమా… (మరల రాయుమా)

నీ ప్రక్షాళన స్వీయమే… ఈ లోకానికే సేవలే
కన్నా ఇది మరచిపోతే మనలేవులే

ఓ ఓ, నడి ఎడారిలో… నడిచే దారిలో
చినుకు రాలెనా బెరుకు మానరా
నలుపు వీడుతు… మలుపు కోరుతు
ఒక ప్రయాణం… ఇది ప్రయాణం
తెలిపినప్పుడే… తనలో తప్పులే
విడిచి దిక్కులే… వెతుకు చుక్కలే
వదిలి రెక్కలే మతము లెక్కలే
ఒక తపస్సిదే ఒక తపస్సిదే

పొరపాటునే చడి చేయగా… అనుమానమే ఇతదాయిద
ఇరకాటమే వదిలేసిన… అభిమానమే దరి చేరునే
ఇక చీకటే వెలివేయగా… మనమారునే తొలి వేకువే
తరిమేయద తడి చీకటే… అయినసారే నువు లోకువే
తరిమేయద తడి చీకటే… అయినసారే నువు లోకువే
చిరుగాలికే చెర లేదులే… చెర చేరిన పడిపోనులే
చిరుగాలికే చెర లేదులే… చెర చేరిన పడిపోనులే
నిజం ఇదే కదా..! కలే విడి పదా..!, ఆఆ

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading