Menu Close

Nenu Nenuga Lene Lyrics In Telugu-Manmadhudu

నేను నేనుగా లేనే… నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో… ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో… కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా…

నేను నేనుగా లేనే… నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో… ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో… కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా…

పూల చెట్టు ఊగినట్టు… పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ… ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు… వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో… ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున… ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదె ఏమైనా… ఓ ఓ హో హోఓ

నేను నేనుగా లేనే… నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో… ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో… కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా…

చుట్టుపక్కలెందరున్నా… గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే… కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా… ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో… నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని… కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే… ఓ ఓ హో హోఓ

నేను నేనుగా లేనే… నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో… ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో… కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా…

Like and Share
+1
1
+1
0
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks