Menu Close

Nenee Darini Nuvvaa Darini Lyrics In Telugu – Bangaru Bommalu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nenee Darini Nuvvaa Darini Lyrics In Telugu – Bangaru Bommalu

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ ఈ ఈ ఈ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ ఈ ఈ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ

కనకదుర్గ కనుసన్నలలో… గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో… గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని… కలిపింది ఇద్దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ

నీ కురుల నలుపులో… నీ కనుల మెరుపులో
అలలై కలలై… అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో… నీ దోర వయసులో
వరదై వలపై… వరదై వలపై తానే ఉరికింది

చిరుగాలుల తుంపరగా… చిరునవ్వుల సంపదగా
చిరుగాలుల తుంపరగా… చిరునవ్వుల సంపదగా
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ ఈ ఈ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ ఈ

పంట పొలాల్లో పచ్చదనంగా… పైరగాలిలో చల్లదనంగా
పంట పొలాల్లో పచ్చదనంగా… పైరగాలిలో చల్లదనంగా
పల్లెపదంలో తియ్యదనంగా… చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ… కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ ఈ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈఈ ఈ ఈ

నేనీదరిని నువ్వా దరిని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ఈ ఈ

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading