ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Neeve Lyrics in Telugu – Phani Kalyan
నీవే…
తొలి ప్రణయము నీవే
తెలి మనసున నీవే
ప్రేమ ఝల్లువే…
నీవే… నీవే…
కలలు.. మొదలు.. నీవల్లే
మనసు.. కడలి అలలు నీవల్లే
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే…
నీవే…
ఎటు కదలిన నీవే
నను వదిలిన నీవే
ఎదో మాయవే…. ఆఁ
ప్రేమే…
మది వెతికిన నీడే
మనసడిగిన తోడే
నా జీవమే… ఆ.. ఆ.. ఆ..
నిలువనీదు క్షణమైనా !
వదలనన్న నీ ధ్యాస..
కలహమైన సుఖమల్లే
మారుతున్న సంబరం…
ఒకరికొకరు ఎదురైతే.
నిమిషమైన యుగమేగా..
ఒక్కోసారి కనుమరుగై
ఆపకింక ఊపిరీ…
నీవే…
గడిచిన కథ నీవే
నడిపిన విధి నీవే
నా ప్రాణమే… ఆఁ
పాదం…
వెతికిన ప్రతి తీరం..
తెలిపిన శశి దీపం
నీ స్నేహమే…
నీ జతే.. విడిచే
ఊహనే.. తాళనులే
వేరొక జగమే
నేనిక ఎరుగనులే…
గుండెలోని లయ నీవే.
నాట్యమాడు శృతి నేనే..
నువ్వు నేను మనమైతే
అదో కావ్యమే…
నీవే…
నను గెలిచిన సైన్యం..
నను వెతికిన గమ్యం..
నీవే నా వరం…ఆఁ
ప్రేమే…
తొలి కదలికలోనే..
మనసులు ముడి వేసే..
ఇదో సాగరం….