Menu Close

Neetho Sayantram Entho Santhosham Song Lyrics In Telugu – Amma Donga

నీతో సాయంత్రం ఎంతో సంతోషం… చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం… చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో… ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో… ఈ రాత్రే సంకురాతిరయ్యో

ఇదో రకం స్వయంవరం… త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హో హో హో హో హో హో హో…
హో హో హో హో హో హో హో…
నీతో సాయంత్రం ఎంతో సంతోషం… చేసేయ్ నీ సంతకం

నీ జంట కోరే సాయంత్రము… నా ఒంటి పేరే సౌందర్యము
మామిళ్ళకొస్తే ఓ ఆమని… కౌగిళ్ళకిచ్చా నా ప్రేమని
ఆ రాధగోలేమో రాగం తీసే… ఈ రాసలీలేమో ప్రాణం తీసే
దరువే ఆనందం… ఐనా పరువే గోవిందం
యమగున్న ఇతగాడే బహు కొంటె జతగాడు…
చలి చుక్కల గిలిగింతకు… పులకింతకు నిను పిలిచెలె

కొంగే బంగారం పొంగే సింగారం… చూసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం… చేసేయ్ నీ సంతకం

మేనత్త కొడుకా ఇది మేనక… మరుజన్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటే నీ ఊర్వశి… నీ కెందుకంట ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి… నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తారాసఖితో సావాసం…

మన ఇద్దరి కసిముద్దుల రసమద్దెల వింటే
నిదరోయిన తొలిజన్మల… సొదలిప్పుడు పొదలడిగెలే

నీతో సాయంత్రం ఎంతో సంతోషం… చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం… చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో… ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో… ఈ రాత్రే సంకురాతిరయ్యో

ఇదో రకం స్వయంవరం… త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హో హో హో హో హో హో…
హా హా హా హా హా హా…

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading