Neekosam Velasindi Song Lyrics In Telugu – prema Nagar
నీ కోసం ఆ ఆ ఆఆ ఆఆ
నీ కోసం ఆ ఆ ఆఆ ఆఆ
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ… హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ… హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ
ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ, ఈఈ
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ
నీ కోసం విరిసిందీ… హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
అలుపు రాని వలపులు… ఆ హహా
ఆడుకునేదిక్కడ… ఆ ఆఆ
చెప్పలేని తలపులు… అహ హా
చేతలయేదిక్కడ… ఆ ఆఆ
విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలి చెలిమీ అనుభవాలు తుది చూచేదిక్కడా
ఆ ఆఆ ఆ ఆ ఓఓ ఓ ఓ ఓ
ఆ హహ అహహాహ, ఆఆ ఆ ఆ
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
కలలెరుగని మనసుకు… అహహ హా
కన్నెరికం చేశావు… ఆఆ ఆ
శిలవంటి మనిషిని… అహహ హా
శిల్పంగా మార్చావు… ఆఆ ఆ
తెరువని నా గుడి తెరిచీ… దేవివై వెలిశావు
నువు మలచిన ఈ బ్రతుకూ… నీకే నైవేద్యం
ఆఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఓఓ ఓ ఓ ఓ
ఆ హహ అహహాహ, ఆఆ ఆ ఆ
నీకోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ… హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ… ప్రేమ మందిరం
నీ కోసం… నీ కోసం