Menu Close

Neekosam Song Lyrics In Telugu -Nenunnanu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరికోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ… సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి

ఓరోరి అందగాడా… నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం… నీ కోసం
నీ కోసం నీ కోసం… నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో… నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళ… ఆకు వక్క సున్నం
నీ కోసం నీ కోసం… నీ కోసం
నీ కోసం నీ కోసం… నీ కోసం

గుండె చాటుగా ఉండనందిగ… ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడ పుట్టుక… కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుక విన్నవించగా… అందుబాటులోనె ఉన్నానుగా
తీగ చాటుగా మూగ పాటగా… ఆగిపోకె రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన… చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన… నిను మీటన చెలి వీణా
అమ్మమ్మో అబ్బబ్బో..!
ఆ ముచ్చట తీరంగ… నీ మెళ్లొ హారంగ
నా రెక్కలు విచ్చె సోకులు తెచ్చి… అందిస్తున్న మొత్తం
నీ కోసం నీ కోసం… నీ కోసం (నీ కోసం నీ కోసం)
నీ కోసం నీ కోసం… నీ కోసం (నీ కోసం నీ కోసం)

సిగ్గుపోరిక నెగ్గలేవుగా… ఏడు మల్లెలెత్తు సుకుమారమా
సాయమియ్యక మోయలేవుగా… లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా… కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలి మెట్టెగా… చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కాన… చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కాన… దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో…!!!
నీ వద్దకు నేనొచ్చి… ఆ హద్దులు దాటించి
నువ్వు వద్దనలేని పద్దతిలోనె… ముద్దుల్నెన్నో తెచ్చా
నీ కోసం నీ కోసం… నీ కోసం (నీ కోసం నీ కోసం)
నీ కోసం నీ కోసం… నీ కోసం (నీ కోసం నీ కోసం)

వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ… సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
ఓరోరి అందగాడ… నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం… నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం… నీ కోసం నీ కోసం నీ కోసం

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading