Menu Close

Nee Prema Naalo Madhuramainadi Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Nee Prema Naalo Madhuramainadi Lyrics In Telugu – Telugu Christian Songs

Telugu Christian Songs Jesus

Nee Prema Naalo Madhuramainadi Lyrics In Telugu – Telugu Christian Songs

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని… క్షేమ శిఖరము ||2||

ఏరి కోరుకున్నావు… ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో… మహిమపరతు నిన్నే
సర్వకృపానిధి నీవు… సర్వాధికారివి నీవు
సత్య స్వరూపివి నీవు… ఆరాధింతును నిన్నే

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని… క్షేమ శిఖరము

చేరితి నిన్నే… విరిగిన మనస్సుతో
కాదనలేదే… నా మనవులు నీవు
చేరితి నిన్నే… విరిగిన మనస్సుతో
కాదనలేదే… నా మనవులు నీవు

హృదయము నిండిన గానం… నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే… చెరగని దివ్య రూపం ||2||
ఇది నీ బాహు బంధాల… అనుబంధమా
తేజోవిరాజా స్తుతి… మహిమలు నీకే
నా యేసురాజా… ఆరాధన నీకే ||2||

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని… క్షేమ శిఖరము

నా ప్రతి పదములో… జీవము నీవే
నా ప్రతి అడుగులో… విజయము నీవే
నా ప్రతి పదములో… జీవము నీవే
నా ప్రతి అడుగులో… విజయము నీవే

ఎన్నడు విడువని ప్రేమ… నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే… నీ కృపయే నాకు చాలును ||2||
ఇది నీ ప్రేమ కురిపించు… హేమంతమా
తేజోవిరాజా స్తుతి… మహిమలు నీకే
నా యేసురాజా… ఆరాధన నీకే ||2||

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని… క్షేమ శిఖరము

నీ సింహాసనము… నను చేర్చుటకు
సిలువను మోయుట… నేర్పించితివి
నీ సింహాసనము… నను చేర్చుటకు
సిలువను మోయుట… నేర్పించితివి

కొండలు లోయలు దాటే… మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి… సమ భూమిపై నడిపినావు ||2||
ఇది నీ ఆత్మ బంధముకై… సంకేతమా
తేజోవిరాజా స్తుతి… మహిమలు నీకే
నా యేసురాజా… ఆరాధన నీకే ||2||

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని… క్షేమ శిఖరము

Nee Prema Naalo Madhuramainadi Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading