ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Navvule Vennelani Lyrics in Telugu – Malliswari
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి
నిలువెత్తు పాలబొమ్మని చేసి
అణువణువు వెండివెన్నెల పూసి
విరితేనెతోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
పగలంతా వెంటపడినా చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానా నిందలేసి
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ