Menu Close

Nee Kallalona Katuka Song Lyrics In Telugu – Jai Lava Kusa

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

నీ కళ్ళలోన కాటుక… ఓ నల్ల మబ్బు కాగా…
నీ నవ్వులోని వేడుక… ఓ మెరుపు వెలుగు కాగా…

నీ మోము నింగి నుండి… ఓ ప్రేమ వాన రాగా…
ఆ వాన జల్లులోన… నేను జల్లుమంటు తడిసిపోగా…ఆ ఆ
తేలి తేలి తేలి తేలి… తేలి తేలి తేలి పోయా…
ఓ ప్రేమ వానలోన మునిగి… పైకి పైకి తేలిపోయా…

నా గుండెలోని కోరిక… ఓ గాలిపటం కాగా…
నా చెంత నువ్వు చేరిక… ఓ దారమల్లె లాగా…
నీ నీలి కురుల నుండి… ఓ పూల గాలి రాగా…
నా ప్రేమ అన్న గాలి పటం… చంద్ర మండలాన్ని చేరగా…ఆ ఆ ఆ

తేలి తేలి తేలి తేలి… తేలి తేలి తేలి పోయా…
అసలు చందమామ నువ్వే అంటూ… నేల మీద వాలిపోయా…

అసుర అసుర అసుర అసుర రావణసూర… || 2 ||

హే… ధగ ధగ ధగ ధగా… నీ సొగసులోని ధగా…
భగ భగ భగ భగా… పెంచింది పడుచు పగ… || 2 ||

నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే… అసుర అసుర…
మెడ వంపులోన నునుపు… గాయానికి కారం పూస్తే… అసుర అసుర…
దారుణంగా దగ్గరయి ఉదృతంగా ఉప్పెనై… అందమైన ఔషధాన్ని తాగనా…

ధగ ధగ ధగ ధగా… నీ సొగసులోని ధగా…
భగ భగ భగ భగా… పెంచింది పడుచు పగ…

అసుర అసుర అసుర అసుర రావణసూర… || 2 ||

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading