ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Navvuthu Bathakalira Thammudu Lyrics In Telugu – Mayadari Malligadu
ఏయ్ నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ… నవ్వుతూ సావాలిరా
హై నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ… నవ్వుతూ సావాలిరా
సచ్చినాక నవ్వలేవురా… ఎందరేడ్చినా బతికిరావురా, తిరిగిరావురా
అందుకే..! నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ సావాలిరా
సంపేది ఎవడురా… సచ్చేది ఎవడురా
హై సంపేది ఎవడురా… సచ్చేది ఎవడురా
శివుడాజ్జ్న లేకుండా… సీమైనా కుట్టదురా
శివుడాజ్జ్న లేకుండా… సీమైనా కుట్టదురా
కుడితే సావాలని… వరమడిగిన సీమ
కుట్టీ కుట్టకముందే చస్తుంది సూడరా… ఆఆ ఆ
అందుకే..! నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ సావాలిరా
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు
నువు సత్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు, దొంగనాయాళ్ళు
అది నువ్వు సూసేదీ కాదు… నిను కాసేదీ కాదు
అది నువ్వు సూసేదీ కాదు… నిను కాసేదీ కాదు
నువ్వు పోయినా… ఆ ఆ ఆఆ ఆ ఆఆ
నువ్వు పోయినా… నీ మంచి సచ్చిపోదురా
ఏయ్ సన్నాసీ నవ్వరా..!!
అందుకే..! నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ సావాలిరా రేయ్
ఉన్నాడురా దేవుడు వోడు వస్తాడురా తమ్ముడూ, ఎప్పుడు..?
అన్నాయం జరిగినప్పుడు… అక్కరమం పెరిగినపుడు
అన్నాయం జరిగినప్పుడు… అక్కరమం పెరిగినపుడు
వస్తాడురా, ఆఆ ఆ ఆ… చచినట్టు వస్తాడురా
అందుకే..! నవ్వుతూ, హెయ్ హెయ్… నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ సావాలిరా
సచ్చినాక నవ్వలేవురా… ఎందరేడ్చినా బతికిరావురా
తిరిగి రావురా
అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ సావాలిరా, హేయ్