ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’.
తమిళ సూపర్‌హిట్ ‘అసురన్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది.
ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
కాగా, ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
జులై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘నారప్ప’ స్ట్రీమింగ్ కానుంది.
తొలుత థియేటర్‌లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది.
Like and Share
+1
+1
+1