ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nannedo Seyyamaaku Lyrics in Telugu – Simhadri
Nannedo Seyyamaaku Lyrics in Telugu – Simhadri
ఆ: నన్నేదో సెయ్యమాకు నడుముకాడ…ఏయ్…హ…
ఏదేదో చెయ్యమాకు ఏటికాడ ..ఏయ్ …హ…
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు..
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరో…
అ: సాకేదో సెప్పమాకు … సందెకాడ ఏయ్ ఓయ్
సొకంతా దాచుకోకు ఆడా ఈడ … ఏయ్..
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు…
అడ్డగోడ పెట్టి నన్ను ఆపమాకు…
అలవాటు చేసుకోవమ్మో…
ఆ: నన్నేదో సెయ్యమాకు నడుముకాడ …
ఆ: కందిచేనుకి షికాఋ కెళితే … కందిరీగే నను కుడితే
అ: కందిచేనుకి షికాఋ కెళితే … కందిరీగే నను కుడితే
ఆ: మంట నాలో మొదలవుతుంటే…
అ: మందు నేనే ఇస్తుంటే…
ఆ: పెదవి ఎంగిలి పై పైన పూస్తే
బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగా కనులే మూస్తే
ఏదేదో చెయ్యమాకు ఆడ ఈడ హేయ్ హ…
నన్నేదో చెయ్యమాకు అందగాడా..ఏయ్ హ
అ: అంతకంటే హయి ఉంది వదులుకోకు…
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు…
అలవాటు చేసుకోవమ్మో
అ: చింతపల్లి సంతకు వెళితే… ఓ చింతపూల చీర కొంటే
ఆ: చింతపల్లి సంతకు వెళితే… చింతపూల చీర కొంటే
అ: కట్టు నీకు కుదరకపోతే..
ఆ: నువ్వు సాయం చేస్తుంటే…
అ: చెంగు బొడ్లో దోపుతు ఉంటే
చెంగుమని నువ్వు ఉలిక్కి పడగానాలో ఉదుకే పుడితే..
సాకేదో చెప్పమాకు …సందెకాడ …ఏయ్…హా
షోకంతా దాచుకోకు… కోక నీడ ఏయ్ ఏయ్
ఆ: పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు…
పెద్ద పెద్ద ఆటలేమి ఆడమాకు…
అలవాటు చేసుకోవయ్యో..
నన్నేదో చెయ్యమాకు…
నడుముకాడ..ఏయ్..హ … హేయ్