Nampally Station Kadi Raaja Lingo Lyrics In Telugu – Erra Mallelu
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా… అ లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా… లింగా
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
తిందామంటే తిండీలేదు… ఉందామంటే ఇల్లే లేదు…

చేదామంటే కొలువు లేదు… పోదామంటే నెలవు లేదు…
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా… లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…
గుక్కెడు గంజి కరువైపాయే… బక్కటి పాణెం బరువైపాయే…

బీదా బిక్కీ పొట్టను గొట్టి… మేడలు గట్టె సీకటి శెట్టి…
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా… లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…
లేని అమ్మది అతుకుల బతుకు… ఉన్న బొమ్మకి అందం ఎరువు…

కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె…
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…అ లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…
ముందు మొక్కులు ఎనక తప్పులు… ఉన్నవాడికే అన్నీ చెల్లును…
ముందు మొక్కులు ఎనక తప్పులు… ఉన్నవాడికే అన్నీ చెల్లును
ఉలకావేమి పలకావేమి… బండారాయిగ మారిన సామి…
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో… రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…అ లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా… లింగా
రామారాజ్యం తీరు సూడు, శివా శంభు లింగా…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.