ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Naa Cheli Rojave Lyrics in Telugu – Roja
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే(2)
కళ్ళల్లో నీవే కన్నీట నీవే
కనుమూస్తే నీవే ఎడలోనిండేవే
కనిపించవో..అందించవో..తోడు(నా చెలి)
గాలి నన్ను తాకినా,నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే,చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంట
నీవు లేకపోతే బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు(నా చెలి)
చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు(నా చెలి)
Like and Share
+1
+1
+1