ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
My Home Bhooja Ganesh Laddu Auction: హైదరాబాద్‌లోని మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం తనకు తాను పోటీ పడుతూ వేలంపాటలో ముందంజలో ఉండే బాలాపూర్ లడ్డూను కూడా వెనక్కి నెట్టిన మాదాపూర్ మై హోమ్ భుజా గణపతి లడ్డూ వేలం పాటలో అత్యంత ధర పలికింది.
మై హోమ్ భుజాలొ హోరా హోరిగా సాగిన లడ్డు వేలం పాటలో.. ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎల్లప్పుడూ ఆ గణనాథుని ఆశీస్సులు మా కుటుంబం పట్ల ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని కొండపల్లి గణేష్ అన్నారు.
ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాటలు పాల్గొంటున్నాము కానీ లడ్డును కైవసం చేసుకోలేకపోయామని, ఈసారి గణేశుని అనుగ్రహంతో లడ్డును కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేలంపాటల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. 2021లో ఇక్కడి లడ్డూ రూ.18.50 లక్షలు, గతేడాది రూ.25.50 లక్షలు పలికింది.
My Home Bhooja Ganesh Laddu Auction