Menu Close

My Heart is Beating Lyrics in Telugu – Jalsa

My Heart is Beating Lyrics in Telugu – Jalsa

My Heart is Beating Lyrics in Telugu – Jalsa

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది
పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్‌ టన్ను బరువవుతుంటే… పుల్ మూన్‌ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ నైన్‌ కాళ్ళ కింద కూర్చుందే… లాండ్ మైన్ గుండెలో పే లిం దే
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది

హే..! ఐ వన బి విత్ యూ ఫర్ ఎవర్
ఐ వన లివ్ విత్ యూ ఫర్ ఎవర్
పెనుతుఫాను ఏదైనా… మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకాన… మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలుపులలో చొరబడుతూ… గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
సెల్‌ఫోన్‌ నీ కబురు తెస్తుంటే… శంఖం మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫ్యాను గాలి వీస్తుంటే… సైక్లోన్‌ తాకినట్టు ఉం టుం దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది

ఎపుడెలా తెగిస్తానో… నామీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో… నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే… పదపద పదమని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే మధనుడి చిలిపి రిథమ్‌
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దమ్మరె దమ్మని తూలే ఆనందం
ఫ్రీడమ్‌ దొరికినట్టు గాలుల్లో… వెల్‌కమ్‌ పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఎదలో… ప్రాణం దూసుకెళ్ళిపోతుందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా… తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీవెయిటింగ్ అనేలా… తరుముతోంది మది

My Heart is Beating Lyrics in Telugu – Jalsa

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading