Menu Close

Mounamelanoyi Ee Marapurani Reyi Lyrics In Telugu – Sagara Sangamam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Mounamelanoyi Ee Marapurani Reyi Lyrics In Telugu – Sagara Sangamam

మౌనమేలనోయి మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల… వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల… వెలిగే కన్నుల
తారాడే హాయిలో..!!
ఇంత మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి

పలికే పెదవి… వణికింది ఎందుకో
వణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా… విరిసే వయసులా
కలిసే మనసులా… విరిసే వయసులా
నీలి నీలి ఊసులు… లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా..!!
మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి

హిమమే కురిసే… చందమామ కౌగిట
సుమమే విరిసే… వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా… వలపూ మడుగులా
ఇవి ఏడడుగులా… వలపూ మడుగులా
కన్నె ఈడు ఉలుకులు… కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసినా..!

మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల… వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల… వెలిగే కన్నుల
తారాడే హాయిలో..!
ఇంత మౌనమేలనోయి… ఈ మరపురాని రేయి

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading