ఐకమత్యమే బలం – అందమైన జీవితం – Motivational Telugu Stories
తండ్రీ కొడుకులు అడవి దారి వెంబడి పోతూ ఉంటే, దారికి అడ్డంగా ఒక చింత మొద్దు పడి ఉంది. కొడుకు ఉత్సాహంగా, “నాన్నా, నేను ఈ దుంగను పక్కకు జరపనా!!” అన్నాడు “ఊ.. ప్రయత్నించు!! నీవు సాధించగలవు నీ సర్వశక్తులు ఉపయోగిస్తే” అని తండ్రి ప్రోత్సహించాడు.
కొడుకు ఎంత ప్రయత్నించినా, దుంగను కదిలించలేక పోయాడు. “మళ్ళీ ప్రయత్నించు… నీవు సాధించగలవు.” అన్నాడు తండ్రి. అలిసిపోయిన కొడుకు “ఇంక నా వల్ల కాదు నాన్నా !!” చేతకాక నిరాశతో చతికిలబడ్డాడు.
“నీ సర్వశక్తులు ఉపయోగించమన్నాను కదా ! నీ శక్తుల్లో నేను లేనా ! నా సహాయం అవసరం లేదా??” తండ్రి అడిగాడు. తండ్రి సహాయంతో ఆ చింత మొద్దును పక్కకు జరిపారు.
మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. మన భవిష్యత్ స్వప్నం సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్థించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం. ఐకమత్యమే బలం కదా..
సేకరణ: V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.