అందమైన జీవితం – Motivational Telugu Stories
ఒక మహిళ ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి తలమీద మూడు వెంట్రుకలే కనిపించాయి. సంతోషంగా, “ఈ రోజు చక్కగా దువ్వుకొని జడ వేసుకుంటాను.” అనుకుంటూ ఆనందించింది.
రెండో రోజు ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే రెండు వెంట్రుకలే కనిపించాయి. సంతోషం పట్టలేక “పాపిట తీసుకుని
రెండు పాయలుగా దువ్వుకుంటా.” అనుకుంది.
మూడో రోజు లేచి చూసుకుంటే ఒక్కటే వెంట్రుక తలమీద ఉంది. ” బాగుంది, బాగుంది. దీన్ని ఇవ్వాళ పోనీ టైల్ గా మార్చుకుంటాను.” అని మురిసి పోయింది. నాలుగో రోజు తల మీద ఆ ఒక్క వెంట్రుక కూడా లేదు. ఆనందంతో ఎగిరి గంతేసి “నేనిక రోజూ తల దువ్వుకోనవసరమే లేదు” అని నవ్వుకుంది.
మన దృక్పథమే అన్నిటికీ మూలం.
మన చుట్టూ ఉన్న చాలా మంది ఏదో ఒక సమస్యతో నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు.
సాదాసీదా జీవితం గడపండి.
హృదయపూర్వకంగా ప్రేమించండి. మాటల్లో అహంభావం కాక దయాగుణం ప్రదర్శించండి. జీవితం అంటే సమస్యలనే తుఫాన్లను
తప్పించుకొని బ్రతకడం కాదు. దాన్ని ‘వర్షంలో నాట్యం’ చేసేంత ఆనందంగా మలచుకోవడం.
సేకరణ: V V S Prasad