ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నీకు ఎదగాలన్న ఒక్క ఆశ పుడితే చాలు నిన్ను ఎవరు ఆపలేరు – Most Inspiring Content in Telugu
పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి. వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి. అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి. అక్కడున్న సమయం మాత్రమే ముఖ్యం… మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్లడమే జీవితం. మనం సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకండి. అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోండి.
కాబట్టి మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక రకంగా అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మనకు కావాల్సినదల్లా మనలో ఎదగాలన్న ఆశ పుట్టడమే. ముందు ఆ కోరికకు, ఆకాంక్షకు ఆద్యం పోయండి. అవే..అవే.. ఎదురొస్తాయి.
మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము. సమస్య రాగానే, ఓడిపోయామని కృంగిపోకూడదు. భగవంతుడు సమయం ఇస్తాడు. నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు.
వాటిని మనం అందిపుచ్చుకోవాలి. లేచి నిలబడి ప్రయత్నం చేయాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే, మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి. అయినా పర్వాలేదు ఇంకో పోటీ, ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.
స్వామి వివేకానంద అన్నారు “కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు! అని”, కానీ పడిన కెరటం, లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు. విరిగి పడిన కెరటం ఛిద్రమై, పతనమై మామూలు నీటిలో కలిసి పోతుంది, అస్థిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం. కొత్త అల సరికొత్త గాలిని నింపుకుని, దిశను ఎన్నుకుని, మెల్లగా ప్రారంభించి రానూ రానూ వేగాన్ని పుంజుకుని, తీరాన్ని చేరుకుంటుంది. అది కొత్త కెరటం. దాని శక్తి అనంతం.
మనిషి కూడా అంతే! మనిషి ప్రతీ పతనం నుండి తేరుకుని, కాస్త ప్రశాంతంగా ఆలోచించి, శక్తిని పుంజుకొని కొత్త కెరటంలా, నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం.
జీవితాన్ని మార్చే పోస్ట్ – Most Inspiring Telugu Story
నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా – Life Lessons in Telugu