ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
గురుశిష్యులిద్దరూ ప్రయాణిస్తుంటే దారిలో ఆకలేసి ఒక ఇంటి తలుపు తట్టారు. చిరిగిన బట్టలతో ఉన్న వ్యక్తి తలుపు తీసాడు. “మేము చాలా ఆకలితో ఉన్నాం ! తినడానికి ఏమైనా…” ఆ వ్యక్తి ఆహ్వానించి భోజనం పెట్టాడు. ఇంటి పరిసరాలు చూసి “ఇంత సారవంతమైన భూమి పోషణ లేక, వృధాగా పడి ఉందే! మీ బ్రతుకు తెరువు ఎలా జరుగుతోంది” అడిగాడు గురువు
“నాకో బర్రె ఉంది. దాని పాలతో రోజులు గడుస్తున్నాయి.” “ఈ రాత్రికి మేం ఇక్కడ ఉండొచ్చా!” అడిగాడు గురువు. అతను ఒప్పుకున్నాడు. అర్ధరాత్రి గురువు లేచి “పద పోదాం” అంటూ బర్రెను కూడా తీసుకెళ్లిపోయారు. శిష్యుడు ఆశ్చర్యపోయి, “అంత సహాయం చేసిన వ్యక్తి బర్రె దొంగిలించడం మంచిదా!” అన్నాడు.
గురువు జవాబు చెప్పలేదు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. శిష్యుడి మనసులో బర్రె దొంగతనం ఇంకా తొలుస్తోంది. ఒకరోజు ఆనాడు ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళాడు శిష్యుడు. ఇప్పుడు ఆ ఇల్లు చుట్టూ పళ్ళతోటతో ఇంద్రభవనంలా ఉంది. శిష్యుడు, “తాము కొన్నేళ్ళ క్రితం వారింటికి అతిథిగా వచ్చామని పరిచయం చేసుకున్నాడు”
అవును! మీరు వచ్చిన రోజే నా బర్రె పోయింది. ఆ తర్వాత బ్రతుకు తెరువుకోసం చాలా కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించి, పండ్ల చెట్లు పెంచడం మొదలు పెట్టాను. మంచి పంట వచ్చింది. ఇప్పుడు నేను ఊళ్లోనే పెద్ద పళ్ళ వ్యాపారిని, నా బర్రె ఆనాడు పోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఆ బర్రె
పాలతో బ్రతికేసే వాడిని.
బద్దకంగా ఏదో విధంగా బ్రతికేయడం కంటే, అవకాశాలను అందిపుచ్చుకొని కష్టపడితే గొప్పగా ఎదగొచ్చు. ఇది కష్టమైన పనే కానీ అసాధ్యం కాదు.
సేకరణ-V V S Prasad