Menu Close

ఎంత గొప్పోళ్లమన్నది కాదు, ఎంతమందికి చేరువయ్యామన్నది ముఖ్యం – Moral Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఎంత గొప్పోళ్లమన్నది కాదు, ఎంతమందికి చేరువయ్యామన్నది ముఖ్యం – Moral Stories in Telugu

ఓసారి రెండువేల రూపాయల నోటు,
ఒక్క రూపాయి నాణెం
ఒకే పర్సులోకి చేరాయి.
ఈ రెండిటి సంభాషణ.
రూపాయి నాణెం
రెండు వేల నోటుతో కలిసిన
తన్మయత్వం తో కూడిన ఆనందంలో
అలాగే చూస్తూ ఉండి పోయింది.

దాంతో రెండు వేల నోట్….
రూపాయి నాణెంతో ఇలా అంది
ఏంటి మిత్రమా నన్ను అంతలా
తదేకంగా చూస్తున్నావ్? అని…..
అప్పుడు రూపాయి నాణెం
అంది ఏమీలేదు మిత్రమా!
నీ విలువ నాకంటే
రెండువేలరెట్లు ఎక్కువ కదా!

money cash

నీవు నీజీవితకాలంలో
ఎంతో మంది కష్టాలు తీర్చి
కన్నీళ్లు తుడ్చి ఉంటావు.
ఎంతో మంది ఆకలి తీర్చి
ఆదుకొని ఉంటావు అని
అందుకే అలా చూస్తున్నా……
దానికి రెండు వేల నోటు
బాధ పడుతూ లేదు మిత్రమా
ఎవ్వరి కన్నీళ్లు తుడిచి….
కడుపు నిండా అన్నం
పెట్టే అవకాశం రాలేదు.

పెళ్లి చూపులు అయ్యాక అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి – How Women Feel During Marriage Process

ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి
ఇంట్లో ఉంటిని వాడు నన్ను
తన లాకర్ లో దాచాడు.
టాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత
ఈమధ్య జరిగిన ఐటీ దాడులలో
నేను బయటకు వచ్చాను.
జైల్లో నుండి బయటపడిన ఆనందం
కాస్తా కొన్ని రోజులు కూడా లేదు.
ఐటీ దాడులలో పట్టు బడిన
సొమ్ము లో నుండి లంచం రూపంలో
ఐటీ అధికారికి ఇచ్చారు.

లంచం తీసుకున్న అధికారి
నన్ను మళ్ళీ బ్యాంక్ లాకర్ లో పడేస్తే
కొన్ని రోజుల తరువాత బయట కొచ్చినా
నా జీవితం మొత్తం జైళ్లోనే(లాకర్లో)నే
గడిచి పోయింది.
కానీ నీసంగతి చెప్పు మిత్రమా
అంటూ రూపాయి వంక చూస్తుంది.
అప్పుడు రూపాయి నాణెం
ఇలా అంది.

Moral Stories in Telugu for Adults about Wife and Husband Relationship

మిత్రమా నాజీవితంలో
ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను.
భిక్షగాడి పళ్ళెంలో పడి
వాడి ఆకలి తీర్చాను.
ఏడుస్తున్న పిల్లాడికి
చాక్లెట్ ఇప్పించి వాడి
మొహంలో చిరునవ్వులు చూసాను.
పూజారి హారతి పళ్ళెంలో
దేవుడి వుండిలో అక్కడి నుండి
భగవంతుని చరణాలు తాకి అలా
ఒక్క చోట ఏంటి?

నేను తిరగని చోటే లేదు మిత్రమా!
భగవంతుని పాదాల నుండి
మొదలుకొని పేదోని అంతిమ యాత్రల
వరకు నేను ప్రతిచోట ఉన్నా అంటూ
ధీమాగా చెప్పింది.
అపుడు రెండు వేల నోటు ఇలా అంది
ఎంత విలువైనది అన్నది
కాదు మిత్రమా! ఎంత మందికి
చేరువై వారి ఆకలి తీర్చామన్నదే
ముఖ్యం అంటుంది.
ఎంత ఉన్నతంగా
బ్రతికామన్నది కాదు,
ఎంత మందిని అక్కున చేర్చుకున్నామన్నదే ముఖ్యం
. . ………నిజమేకదా?
…….. స్వామి

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading