Menu Close

పనికిరాని విషయాలను మోయకండి – తెలుగు స్టోరీస్ – నీతి కథలు – Moral Stories in Telugu


పనికిరాని విషయాలను మోయకండి – Moral Stories in Telugu

Moral Stories in Telugu: సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం, అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ “భవతి భిక్షామ్ దేహి” అని అడుగుతున్నారు.

ఒక ఇంట్లో నుండి చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది, ఒకామె ఒంటి కాలిమీద లేచి తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, ఊగిపోయింది. ఒకరిద్దరు పాత్రల్లో బియ్యం పోశారు.

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారివారి పనుల్లో మునిగిపోయారు.

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు.

పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది. వికారంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను అన్నాడు.

అప్పుడు వివేకానందుడు అతడిని కొన్ని ప్రశ్నలు అడగసాగాడు.

ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి?
స : సగం పాడయిపోయిన అరటి పండు, కొద్దిగా బియ్యం.
ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం?
స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి, బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం.

మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు, అవి నీవి కావు. నీతో రాలేదు. మనం అరటిపండు, బియ్యమే తీసుకున్నాము కానీ, తిట్లను తీసుకోలేదు.. ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి, లేనిదానికి నువ్వెందుకు అకారణంగా బాధపడుతున్నావు.

monk, swamiji, brahmin

మనమూ అంతే. తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన, పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి.. ఎవెరెవరివో ఎప్పటెప్పటివో కనీసం అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం..

మన మనసులో అనవసరంగా మోస్తున్న ఆ పనికిరాని విషయాలను వదిలేసి చూడండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.

Like and Share
+1
4
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading