ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral Stories in Telugu
పురాతన గ్రీస్ దేశంలో సోక్రటీస్ మహా మేధావి, విజ్ఞాని. ఒక పరిచయస్తుడు ఒక రోజు అయిన వద్దకు వచ్చి”మీ స్నేహితుడి గురించి నాకొక విషయం తెలిసింది!” “ఒక్కక్షణం ఆగు, నాకా విషయం చెప్పే ముందు మూడు ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్పి, తరవాత ఆ విషయం చెప్పు. సరేనా!!” అన్నాడు సోక్రటీస్.
1) నీవు చెప్పే విషయం నిజమని కచ్చితంగా తెలుసా!” “లేదు, కానీ నేను విన్నది మీకు చెప్పాలనుకున్నాను.” “అయితే అది నిజమో కాదో నీకు తెలీదన్నమాట !!”
2) “నాకు చెప్పబోయేది మంచిదా, చెడ్డదా!!” “తెలీదు…. కానీ…” అంటూ నసిగాడు. “కాబట్టి నీవు చెప్పదలుచుకున్నది అతనికి చెందిన ఒక చెడ్డ విషయం , నిజమో కాదో కూడా తెలీదన్న మాట!”
3) “నీవు చెప్పేది నాకు ఎంత ఉపయోగ పడుతుంది,” “లేదు…. మీకు నిజంగా ఉపయోగ పడకపోవచ్చు…” ” నిజం కానిది, మంచిది కానిది, నిరుపయోగమైనది నాకు చెప్పడం ఎందుకు ????.”
తెలిసీ తెలియని పుకార్లను వినడం, ప్రచారం చేయడం నిరుపయోగం
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu