ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Moral of Mahabharatham in Telugu – 10 Points
- మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.
ఉదా: కౌరవులు.
- నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ.. ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని “అధర్మం కోసం వినియోగిస్తే”.. అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.
ఉదా: కర్ణుడు
- యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.
ఉదా:అశ్వత్థామ.
- పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.
ఉదా: భీష్ముడు.
- సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారం తో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశం జరుగుతుంది.
ఉదా: “దుర్యోధనుడు “
- స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.
ఉదా: ధృతరాష్ట్రుడు
- శక్తి యుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.
ఉదా: అర్జునుడు.
- ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.
ఉదా: శకుని
- నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.
ఉదా : యుధిష్ఠిరుడు
- అందరి బంధువైనా.. అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.
ఉదా : శ్రీకృష్ణుడు
Like and Share
+1
3
+1
+1