ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రాయుడో..!
నాయకుడై నడిపించేవాడు
సేవకుడై నడుమొంచేవాడు
అందరి కోసం అడుగేశాడు
రాయుడో రాయుడో..!!
హె..! మిరమిరా మీసం
మిర మిరా మీసం… మిర మిరా మీసం
మెలితిప్పుతాడూ జనం కోసం
డన డన డంటడడం… డన డన డంటడడం
డన డన డం
కర కరా కండల రోషం… కర కరా కండల రోషం
పోటెత్తుతాదీ జనం కోసం
డన డన డంటడడం… డన డన డం
మండె ఆవేశం… వీడుండే నివాసం
వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలెలా… హా ఆ ఆఆ
సూరీడల్లే..!
హే సూరీడల్లే వచ్చాడూ
మన అందరి కాటమరాయుడూ
పంచే కట్టిన మంచితనం
నిలువెత్తు కాటమరాయుడు
మిర మిరా మీసం… మిర మిరా మీసం
మెలి తిప్పుతాడూ జనం కోసం
రాయుడో..!!!
ఒకడే వీడు… రకరకములవాడూ
ఏ రంగు కళ్ళకు… ఆ రంగై ఉంటాడు
రెపరెపలాడే జండాలా పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు… కలగలసిన ఖడ్గం వీడై
హే..! సూరీడల్లే వచ్చాడూ… మన అందరి కాటమరాయుడూ
అమ్మతోడు మా చెడ్డ మంచోడు కాటమరాయుడు
హే..! అసలు సిసలు చురుకు సరుకు
అణువణువున సెగ రగిలెలా… హా ఆ ఆ
సూరీడల్లే, హే… సూరీడల్లే వచ్చాడూ
మన అందరి కాటమరాయుడూ
పంచే కట్టిన మంచితనం… నిలువెత్తు కాటమరాయుడు
డన డన డన డన డనాన డననననా
డన డన డన డన డనాన డననననా
హేయ్ రాయుడో…!!