ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మెరిసే మెరిసే మెరిసే… కనులే తొలిగా మెరిసే
అరరే కలలే ఎదుటే వాలేనులే
మనసే మనసే మనసే… తనలో తనుగా మురిసే
కురిసే ఆనందంలో తడిసేనులే
ఈ క్షణం ఎదకి వినబడి… తొలి గెలుపే పిలిచే పిలుపే
ఇది వరకెరుగని మెరుపుల… మలుపిపుడే ఇపుడే ఇపుడే
చిత్రంగా చూస్తూ ఉంటే నేరుగా… చైత్రాలే స్వరాలు తీసేనే
చుట్టూరా సుమాలు పూసేనే
తొణికసలే కలలే కలలే… అందంగా బంధాలల్లే వేళలో
వాకిట్లో వసంతమొచ్చెనే… దోసిట్లో వరాలు నింపేనే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే
ఒకరితో ఒకరు ఒడిపడి తరుణం
కడవరకు విడిపోని కళ్యాణయోగం
నలుగురు కలిసే కలివిడి సమయం
ఈ హాయి చిరకాల జ్ఞాపకం
జతకలిపే గుణమే… అలవడితే బలమే
పనిలో పడితే… నిలువున పరవశమే
సందడిగా జనమే… ఒంటరిగా మనమే
మదిలో మెదిలే… తెలియని కలవరమే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం… చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే
వరసలు కలిపి… మనుసులు తెలిపే
అరమరికల పొడలేని సాంగత్యమేనా
అలసట మరిచి… అటు ఇటు తిరిగి
ఊరంతా వినిపించే వేడుక
మది ఒకటే అడిగే… వలదన్నా వినదే
అసలే తనది ఎదగని పసితనమే
తన కోసం తరచూ… పరిగెడుతూ పడుతూ
తను కోరినది వెతుకుట అవసరమే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం… చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే