ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మెల్లగా తెల్లారిందోయ్ అలా… వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా…
చేదతో బావులలో గలగల… చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళా…
చుట్ట పొగమంచుల్లో… చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా…
మమతల్ని పండించి అందించు హృదయంలా…
చలిమంటలు ఆరేలా… గుడిగంటలు మోగేలా…
సుప్రభాతాలే వినవేలా… ఆ ఆ
గువ్వలు వచ్చే వేళ… నవ్వులు తెచ్చే వేళ…
స్వాగతాలవిగో కనవేలా… ఆ ఆ
పొలమారే పొలమంతా… ఎన్నాల్లో నువ్వు తలచి
కళ మారే ఊరంతా… ఎన్నేళ్లో నువ్వు విడచి…
మొదట అందని దేవుడి గంట… మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన… పసితనమే గురుతొస్తుందా…
ఇంతకన్నా..ఆ ఆ… తియ్యనైన…ఆ ఆ… జ్ఞాపకాలే…
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన…
నువ్వూగిన ఉయ్యాల… ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనబడకా…ఆ ఆ
నువ్వాడిన దొంగాట… బెంగల్లే మిగలాలా
నన్నెవరూ వెతికే వీల్లేకా…ఆ ఆ
కన్నులకే..ఏ ఏ.. తియ్యదనం… రుచి చూపే..ఏ ఏ.. చిత్రాలే…ఏ ఏ
సవ్వడితో… ఓ ఓ.. సంగీతం…ఓ ఓ.. పలికించే సెలయేళ్లే… ఏ ఏ
పూలచెట్టుకి ఉందో భాష… అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే… అందం మాటాడే భాష…
పలకరింపే.. ఏ ఏ… పులకరింపై.. ఏ ఏ పిలుపునిస్తే… ఏ ఏ
పరవశించడమే మనసుకి తెలిసిన భాష…
మమతలు పంచే ఊరు… ఏమిటి దానికి పేరు…
పల్లెటూరేగా ఇంకెవరూ… ఊఉ
ప్రేమలు పుట్టిన ఊరు… అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ… ఊఉ