Meghaalu Lekunna Song Lyrics In Telugu – Kumari 21F – మేఘాలు లేకున్నా లిరిక్స్
మేఘాలు లేకున్నా… నా పైన ఈ వాన
రాగాలు తీసే… నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా… నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ… నీ వల్లేనా
వెళ్ళే దారిలో… ఓ ఓ, లేడే చంద్రుడే
అయినా వెన్నెలే… అది నీ అల్లరేనా
ఓ… చెట్టు నీడనైనా లేనే… పైన పూల వాన, ఆ ఆ
మేఘాలు లేకున్నా… నా పైన ఈ వాన
రాగాలు తీసే… నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా… నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ… నీ వల్లేనా
కోపముంటే నేరుగా… చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే… పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా… చెప్పకుండా ఇలా
మేలుకున్నా కలలతో… వేస్తావుగా సంకెలా
పూట పూట పొలమారుతుంటె… అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద… తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే… నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా… నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..!!
మాటలోన లేదుగా… ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా… స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా… గిల్లి చెప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా… నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న… పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట… ఒక కౌగిలింత ఎదుట
ఓఓ… మన మధ్య దారంకైనా… దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా… నా పైన ఈ వాన
రాగాలు తీసే… నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా… నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ… నీ వల్లేనా.. ..
Meghaalu Lekunna Song Lyrics In Telugu – Kumari 21F – మేఘాలు లేకున్నా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.