Menu Close

మట్టి పాత్రల విశిష్టత – పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Hindu Life Styles, Unknown Facts in Telugu

      *వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .

      *ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని  తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది .

       ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు .

       ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది . గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం .

      ప్రాచీన కాలంనుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి , మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు . ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే . మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి . మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో  వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి , లోపించాయి అని తేలింది . *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది .

       మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . ఆనందంగా జీవిస్తారు .

     మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .

      మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు . అన్ని రకాల మట్టి పాత్రలకు పనికి రాదు . ఏ మట్టి పనికి వస్తుందో , ఎలాంటి మట్టిలో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు . ఇంత గొప్ప సేవచేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు . మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం

మనం తినే ఆహారమే మన ఆలోచనలను అదుపు చేస్తుంది

Like and Share
+1
4
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading