Menu Close

నిరాశ మధ్య వెలిగే ఆశ – ఓ మనిషి ప్రయాణం – Man’s Search for Meaning – Book Recommendations


నిరాశ మధ్య వెలిగే ఆశ – ఓ మనిషి ప్రయాణం – Man’s Search for Meaning – Book Recommendations

  • విక్టర్ ఫ్రాంకుల్ నాజీ శిబిరాల్లో బంధీగా ఉన్నా, జీవితం మీద ఆశను కోల్పోలేదు.
  • ఆయన అనుభవాల ద్వారా జీవితానికి అర్థం ఎలా వెతకాలో ఈ పుస్తకం చెబుతుంది.
  • జీవితం మీద ఆసక్తిని కోల్పోకుండా బతకడం ఎలా అన్నది స్పష్టంగా చూపిస్తుంది.
  • మనకి ఎదురయ్యే సమస్యలకి మనం స్పందిస్తామో అన్నది మన చేతుల్లోనే ఉంటుంది, అదే మన ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది.
  • ప్రేమ, లక్ష్యం, ఆశ వంటి విలువలు మనకు జీవించడానికి శక్తినిస్తాయి.
  • ఈ పుస్తకం బాధపై మన దృష్టిని మార్చి, ఆశను కలిగిస్తుంది.
  • ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
Man's Search for Meaning - Book Recommendations

పుస్తకం పేరు: Man’s Search for Meaning
రచయిత: విక్టర్ ఈ. ఫ్రాంకుల్ (Viktor E. Frankl)
ప్రచురణ సంవత్సరం: మొదటగా 1946లో జర్మన్ భాషలో ప్రచురణ, తరువాత అనేక భాషల్లోకి అనువాదం
ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు: 16 మిలియన్లకు పైగా
ప్రముఖత: న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచినది.

హిట్లర్ సమయంలో నాజీల దగ్గర బంధీగా ఉన్న సమయంలో కూడా జీవితానికి అర్థం ఉందని నమ్మిన మనిషి విక్టర్ ఫ్రాంకుల్. ఈ పుస్తకంలో ఆయన వ్యక్తిగత అనుభవాలు మరియు మన జీవితానికి అర్థాన్ని ఎలా వెతకాలో, కష్టాలలో ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతారు. కష్టాలు, బాధలు మనల్ని అంతం చెయ్యవు వాటిలో కూడా మన జీవితానికి ఓ అర్థం ఉందనే నమ్మకం కలిగిస్తుంది ఈ పుస్తకం!

ప్రతి ఒక్కరి జీవితానికి ఓ అర్థం ఉంటుంది: మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి కఠినమైన పరిస్థితులు ఎదురైన కొన్నాళ్ళకి జీవితం మళ్ళీ అర్థవంతంగా మారుతుంది.

సమస్యలకి మనం ఎలా స్పందిస్తున్నాం అనేది చాలా ముఖ్యం: మనకేం జరుగుతుందో అది మన అదుపులో వుండదు కానీ మనం దానికి ఎలా స్పందిస్తాము అనేది మన చేతిలోనే ఉంటుంది.

బాధ మనల్ని బలంగా మారుస్తుంది: బాధ, నిరాశల నుండి కూడా మనం ఉత్తేజం పొందాలి, బాధను తట్టుకోవడం వల్ల మానసికంగా మనం చాలా దృడంగా తయారవుతాం.

సహనం చాలా అవసరం: నాజీ క్యాంపుల్లో ఎదురైన దారుణ అనుభవాలు అన్నిటిని తట్టుకొని బతికిన ఫ్రాంకుల్, మనిషి మానసిక ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో చూపించారు.

మనం పడే బాధకి ప్రయోజనం వుండాలి: జీవితంలో ప్రయోజనం ఉన్నప్పుడే మనిషి ఎలాంటి బాధనైనా తట్టుకోగలడు. ఉదాహరణకు, ప్రేమ, సేవ, స్వప్నం వంటి లక్ష్యాలు మనకు ఆశను ఇస్తాయి.

ప్రేమే మన ఆత్మబలం: మనల్ని కట్టేసినా, ఏ దుస్థితిలో పెట్టినా మనకున్న ప్రేమించగలిగే శక్తిని ఎవరూ మన నుండి దూరం చేయలేరు. ప్రేమే మన ఆత్మబలం.

నిరాశలో కూడా నవ్వుతూ వుండాలి: ఎంత బాధలో ఉన్నా, చమత్కారం, నవ్వు మన మనోబలాన్ని నిలబెట్టేందుకు సహాయపడతాయి.

భవిష్యత్తుపై ఆశను కలిగి వుండాలి: నిరాశలో ఉన్నప్పటికీ “ఒక రోజు వెలుగు వస్తుంది” అనే నమ్మకం మనిషిని బతికిస్తుంది. ఎప్పుడూ ఒక ఆశను మనసులో ఉంచుకోవాలి.

మనకున్న లక్ష్యమే మనకు బలం: జీవితానికి ఓ లక్ష్యం ఉంటే, మనిషి ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలడు. ఏదైనా ఓ చిన్నపని, ఒక బాధ్యత, ఒక వ్యక్తి కోసం జీవించడమే మన బలానికి మూలం.

ఈ పుస్తకం మనకు ఎన్నో మార్గదర్శక సిద్ధాంతాలు నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

ఇక్కడ తెలుగులో చదవండి👇
Man’s Search for Meaning in Telugu

మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి – Find Your Balance Point – Book Recommendations

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading