Menu Close

Manmadhuda Nee Kalaganna Song Lyrics in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మన్మధుడా నీ కలగన్నా… మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా… మన్మధుడే నా కావలిగా..
నన్ను పారేసుకున్నాలే… ఎపుడొ తెలియకా…
నిన్ను కన్న తొలి నాడె… దేహం కదలకా…
ఊహలలో అనురాగం… ఊపిరి వలపేలే…

ఎందరినో నే చూసాగాని… ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎపుడు ఎరుగని… ఇతడే నా ప్రియుడు
ఎందరినో నే చూసాగాని.. ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగ ఎప్పుడు ఎరుగని… ఇతడే నా ప్రియుడు…

మన్మధుడా నీ కలగన్నా… మన్మధుడా నీ కథవిన్నా
మన్మధుడంటే కౌగిలిగా… మన్మధుడే నా కావలిగా…

మగువగా పుట్టినా… జన్మ ఫలితమీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా… మనసు గెలిచిన తోడు కలిసే
ఎదలలోన ఊయలలూగే… అందగాడు ఇతడంట
ఎదకు లోతు ఎంతో చూసే… వన్నెకాడు ఎవరంట

ఒక్కచూపుకు తనివే తీరదు… అదియే విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే… ఇదియే చరిత్రమో
ఒక్కచూపుకు తనివే తీరదు… అదియే విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే… ఇదియే చరిత్రమో

మన్మధుడే నా ప్రాయముగా… మన్మధుడే నా ప్రాణముగా
మన్మధుడే నా ప్రణయమని… మన్మధుడే నాకిష్టమని…
చుక్క పొద్దుల్లో దాహం… పెంచు ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం… సిగ్గు నేనవ్వనా
నా పడకటింటికీ నీ పేరే పెట్టనా…

అందం నీకే రాసిస్తాలే… నన్నే ఏలు దొర
ఆ ఆఖరివరకు నీతో ఉంటా… కనవా నా ప్రేమా…
అందం నీకే రాసిస్తాలే… నన్నే ఏలు దొర
ఆ ఆ ఆఖరివరకు నీతో ఉంటా… కనవా నా ప్రేమా…

Like and Share
+1
0
+1
1
+1
0

Subscribe for latest updates

Loading