ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
లంబోదర లంబోదర
హే, మట్టీతో నిన్ను చేసి… చిట్టీ మండపమేసి
అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం
పూలా మాలేసి… పులిహోర నైవేద్యం పెట్టి
మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం
మట్టీతో నిన్ను చేసి… చిట్టీ మండపమేసి
అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం
పూలా మాలేసి… పులిహోర నైవేద్యం పెట్టి
మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం
ఏ, దేవాది దేవా…
ఆది పూజిత… అందుకో హారతి, ఈ ఈఈ ఈ
గజాననా గణపతి… గజ ముఖుడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
భజనతో భక్తి చూపు పొంగి పోతడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్లం
మా సేను సెలకల్లో సెమటా సుక్కాలం
కాలాలే కల్లంలో రాశులయ్యేలా
దీవించు మా బతుకు వెలిగి పోయేలా
నిను నిలిపి నవరాత్రులే… మైమరిచి పోతాములే
మరిచేలా కైలాసమే… కోలాటాలే వేస్తాములే
ఇరుకనుగోకే మండపాన్నే… మా మనసే విశాలమంటా
సాలనుకోవే సరిపోకుంటే… మా సిన్ని లడ్డే
నువ్వుంటే సాలంటా
కొలాసగా ఉల్లాసంగా మాతో, హో హో
గజాననా గణపతి… గజ ముఖుడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
భజనతో భక్తి చూపు పొంగి పోతడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
మట్టీతో నిన్ను చేసి… చిట్టీ మండపమేసి
అడవీకి పోయి పూలు పండ్లు తెచ్చినం
పూలా మాలేసి… పులిహోర నైవేద్యం పెట్టి
మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం
ఆ ఎండీ ఎన్నెల్లో… ఎండి కొండల్లో
నీ తల్లి ఒడిలోనా… గారంగా పెరిగి
మా ఊరి సందుల్లో మైకు సప్పుల్లో
సిందేసి ఆడేవే కొలిచే భక్తుల్లో
ఎలుక రథమెక్కుతావెలా… ఏనుగు రూపమున్న నూవలా
గౌరమ్మ పురుడు పోయగా… గంగమ్మ ఒడి చేరుతావులే
రంగురంగులెగురుతుంటే… మొదలయ్యే నీ ఊరేగింపే
సిన్నా పెద్ద సిందేస్తుంటే… సామి ఎవరాపే
ఆరావీర నమఃశివాయని… ఖడ్గాలే కంఠం విప్పే
అది వింటే పరమేశ్వరుడే… మాతో పాదం కదిపే
నీ వెంట దారంతా…
పువ్వుల వానై కురిసే భక్త భక్తంటా, ఆ ఆఆ ఆ
గజాననా గణపతి… గజ ముఖుడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
భజనతో భక్తి చూపు పొంగి పోతడే
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం
గం గణాగణ గం గణేశ… గం గణాగణ గం